
కొండాపూర్ లో ఘటన కరీంనగర్ క్రైం/గన్నేరువరం, వెలుగు : బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తప్పించడాన్ని జీర్ణించుకోలేక ఆ పార్టీ లీడర్సొల్లు అజయ్ వర్మ శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగారు. ఈ ఘటన బీజేపీ శ్రేణుల్లో కలకలం రేపింది. కరీంనగర్జిల్లా గన్నేరువరం మండలం గునుకుల కొండాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సొల్లు అజయ్ వర్మ బండి సంజయ్ కు అనుచరుడిగా ఉన్నారు. సంజయ్ ను అధ్యక్ష పదవి నుంచి తప్పించినప్పటి నుంచి ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఈ క్రమంలోనే తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు. ఈ సందర్భంగా సంజయ్‌ను ఉద్దేశించి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు.
‘‘ మిమ్మల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తొలగించినప్పటి నుంచి నేను చాలా బాధపడ్తున్నాను. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలనే ధృడ సంకల్పంతో మీరు చేస్తున్న కృషిని హైకమాండ్ఎందుకు గుర్తించలేదో అర్థం కాలేదు. సంజయ్ అన్న అంటే నాకు దు:ఖమొస్తుందని రాజగోపాల్ రెడ్డి మాట్లాడిన మాటలు నన్ను నిజంగా బాధపెడుతున్నయి అన్న. నిజాయితీపరులకు పార్టీలో స్థానం లేదని, దొంగలకు, బడాబాబులకు చోటుందని అర్థమైంది. మీ పవర్ ఎవరికీ అర్థం కాదు. కనీసం నా చావుతోనైనా హైకమాండ్సంజయ్ అన్నకు మంచి అవకాశాలిస్తారని ఆశిస్తూ నేను మీ నుంచి శాశ్వతంగా దూరమవుతున్నా.’’ అని ఏడ్చాడు.
పరిస్థితి విషమం..
పురుగుల మందు తాగి వీడియో రిలీజ్ చేయడంతో అలర్ట్అయిన ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ గ్లోబల్ హాస్పిటల్ కు తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఐసీయూలో ట్రీట్‌మెంట్ చేసినప్పటికీ అజయ్ వర్మ ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో రాత్రి హైదరాబాద్ కు తరలించారు.