తండ్రీకొడుకులిద్దరికీ దమ్ముంటే యూనివర్సిటీకి రావాలి

తండ్రీకొడుకులిద్దరికీ దమ్ముంటే యూనివర్సిటీకి రావాలి

కేసీఆర్, కేటీఆర్ ఇద్దరికీ దమ్ముంటే యూనివర్సిటీకి వస్తే.. ఉద్యోగాలపై చర్చిద్దామని బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సవాల్ విసిరారు. కేటీఆర్, కేసీఆర్‌లు పక్కా జూట కూతలు కూస్తున్నారని ఆమె మండిపడ్డారు. ‘తెలంగాణ వస్తే ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతారని.. ఇంటికో ఉద్యోగం వస్తుందని కేసీఆర్ చెబితే ప్రజలు నమ్మారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్ నడుపుతోంది కేటీఆరా? కేటీఆర్, కేసీఆర్‌లు పక్కా జూట కూతలు కూస్తున్నారు. పబ్లిక్ సెక్టర్ ఉద్యోగాలు కూడా మేమే ఇచ్చామని చెప్పుకోవడానికి సిగ్గు ఉండాలి. కొత్త ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావో చెప్పు. విద్యా శాఖలో ఎన్ని భర్తీ చేశావో చెప్పాలి. తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరు అని కేసీఆర్ అన్నారు. కాలేజీలు ఉన్నవాళ్లను, యూనివర్సిటీలను పెట్టిన వాళ్లను పోటీలో పెట్టి మోసం చేస్తున్నారు. ఈ ఏడు ఏళ్లలో 40 వేల ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్ అయితే భర్తీ చేసింది 32 వేలు మాత్రమే. తెలంగాణ ఏర్పడ్డాక రాష్ట్రంలో నిరుద్యోగం పెడిగిందే తప్ప తగ్గలేదు. తండ్రీకొడుకులిద్దరూ దమ్ముంటే యూనివర్సిటీకి రండి చర్చిద్దాం. తెలంగాణను కాపాడుకోవాలంటే కేటీఆర్‌ని ఓడించాల్సిందే. మీరు చెప్పింది వాస్తవమే అయితే మా సవాల్‌ని స్వీకరించాలి’ అని డీకే అరుణ అన్నారు.