రాహుల్‌‌ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. బీజేపీ నేత డీకే అరుణ

రాహుల్‌‌ గాంధీ వ్యాఖ్యలు సిగ్గుచేటు.. బీజేపీ నేత డీకే అరుణ

హైదరాబాద్, వెలుగు: కర్నాటకలో కాంగ్రెస్ గెలవగానే ఆ పార్టీ నాయకులు ఎగిరెగిరి పడుతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. ఖమ్మం సభలో కాంగ్రెస్‌‌ నేత రాహుల్ గాంధీ బీజేపీకి.. బీఆర్ఎస్ బీ టీమ్ అనడం సిగ్గు చేటని ఫైర్ అయ్యారు. గతంలో బీఆర్ఎస్‌‌తో పొత్తు పెట్టుకుంది బీజేపీనా.. కాంగ్రెస్సా.. అని సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఇటీవల పాట్నాలో ప్రతిపక్ష నాయకుల సమవేశంలో పాల్గొన్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌‌ యాదవ్ ఇప్పుడు హైదరాబాద్‌‌కు వచ్చి సీఎం కేసీఆర్‌‌‌‌ను కలవడం దేనికి సంకేతమన్నారు.

అఖిలేశ్‌‌ను కాంగ్రెస్ దూతగా బీఆర్ఎస్ వద్దకు పంపారని, గతంలో కాంగ్రెస్ నాయకులే బీఆర్ఎస్‌‌కు అమ్ముడు పోయారని ఆమె ఆరోపించారు. భవిష్యత్తులో కూడా అదే జరుగుతుందని చెప్పారు. ఏఐసీసీ అధ్యక్ష పదవి వద్దన్న రాహుల్ గాంధీ, ఇప్పుడు ఏ హోదాలో మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీయా లేక మల్లికార్జున్ ఖర్గేనా? అని అరుణ ప్రశ్నించారు.