
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ కరోనా బారిన పడ్డారు. సోమవారం ఆయన సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. రెండు, మూడు రోజులుగా ఆయన కొంత అస్వస్థతతో ఉండడంతో కరోనా టెస్టు చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. విషయం తెలుసుకున్న హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, పలువురు బీజేపీ నేతలు ఆయన్ను ఫోన్లో పరామర్శించారు.
మాజీ మంత్రి గీతారెడ్డి దంపతులకు..
కంటోన్మెంట్: మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ గీతారెడ్డి, ఆమె భర్త రామచంద్రారెడ్డి కరోనా బారిన పడ్డారు. ఇటీవల వారికి జ్వరం రావడంతో సోమవారం టెస్టు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో వారిద్దరు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.