సెల్ఫ్ డిస్మిస్ అనేది కార్మిక చట్టంలో లేదు: వివేక్ వెంకటస్వామి

సెల్ఫ్ డిస్మిస్ అనేది కార్మిక చట్టంలో లేదు: వివేక్ వెంకటస్వామి

సెల్ఫ్ డిస్మిస్ అనేది కార్మిక చట్టంలో లేదన్నారు మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి. . ధర్మపురిలో గాంధీ సంకల్పయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన..ఆర్టీసీ ఉద్యోగులు 15 సంవత్సరాలు పనిచేసిన కేవలం రూ. 25వేల రూపాయల జీతం మాత్రమే వస్తుందన్నారు. రూ.10 ఇచ్చి రూ.100 కేసీఆర్ సంపాదిస్తున్నారని విమర్శించారు.  నియంతృత్వ పాలనతో కార్మికుల మరణాలకు కేసీఆర్ కారమవుతున్నారని అన్నారు. ప్రైవేట్ బస్సులు వస్తే ఛార్జీలు డబల్ అయి ప్రజలపై భారం పడుతుందన్నారు.

మోడీకి పేరొస్తుందనే  కేసీఆర్  రాష్ట్రంలో ఆయుష్మాన్ పథకం అమలు చేయడం లేదన్నారు .గత ప్రధానుల కంటే మోడీ బాగా పనిచేస్తున్నారు. కేసీఆర్ కు అహంకారం పెరిగిందని..ఆయనను గద్దె దించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ లో కేంద్రం వాటా 70 శాతం ఉందన్నారు.  ఆ విషయం  చెప్పకుండా పెన్షన్ తానే ఇస్తున్నట్టు  కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారన్నారు.