గోడు చెప్పుకున్న ప్రజలు.. నేనున్నానంటూ వివేక్ వెంకటస్వామి భరోసా

గోడు చెప్పుకున్న ప్రజలు.. నేనున్నానంటూ వివేక్ వెంకటస్వామి భరోసా

మాజీ ఎంపీ, బీజీపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి జగిత్యాల జిల్లాలో పర్యటించారు. ధర్మపురి నియోజకవర్గం దొంగతుర్తిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి  రథోత్సవంలో పాల్గొన్నారు. స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం  ఆలయ అర్చకులు శాలువాతో వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. అనంతరం ధర్మారంలోని భక్త మార్కండేయ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న  ఆయన, ఎండపల్లిలోని దుర్గాదేవి అలయలో ప్రత్యేక పూజలు చేశారు. ఎండపల్లి గ్రామస్తులు తమ సమస్యలను వివేక్ వెంకటస్వామికి చెప్పుకున్నారు.  తమ కాలనీకి త్రాగు నీరు రావడం లేదని.. అధిక విద్యుత్ బిల్లులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గోడు వెళ్లబోసుకున్నారు. తమ కాలనీకి ఒక బోర్వెల్ పంప్ సెట్ కావాలని కోరడంతో వివేక్ వెంకటస్వామి సానుకూలంగా స్పందించారు.

ఉండేడ గ్రామంలో పర్యటించిన వివేక్ వెంకటస్వామి .. హనుమాన్ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో. ఈ సందర్భంగా  మాజీ కేంద్రమంత్రి, దివంగత నేత కాకా వెంకటస్వామి కృషితోనే తమ గ్రామానికి న్యాయం జరిగిందని  ఉండేడ ప్రజలు తెలిపారు. తర్వాత పెగడపల్లి మండలం లోని రెడ్డి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేసిన వివేక్ వెంకటస్వామి.. స్థానిక రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.  బతకపెల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఇల్లును పరిశీలించి ప్రభుత్వం తరఫున సాయం అందించాలని ఎమ్మార్వోతో ఫోన్లో మాట్లాడారు. అనంతరం  వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.