
మేడ్చల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ ముట్టడికి తరలివెళ్లిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇటీవల పంపిణీ చేసిన ఇళ్లలో స్థానికులకు ఇళ్లు రాలేదని ఆరోపిస్తూ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడికి సెప్టెంబర్ 4న బీజేపీ పిలుపునిచ్చింది.
విషయం తెలుసుకున్న పోలీసులు క్యాంప్ ఆఫీస్ చుట్టూ భారీ బందోబస్తు పెంచారు. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా నేతలు నినాదాలు చేస్తూ భవనంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న పోలీసులు ఎక్కడివారినక్కడ అరెస్ట్ చేశారు.
ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పలువురు కార్యకర్తలకు గాయాలయ్యాయి. అరెస్ట్ అయిన వారిలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డితో పాటు మరో 25 మంది ఉన్నారు. వారందరినీ ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు.