టీఎఎన్జీవో ఉద్యోగులపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

టీఎఎన్జీవో ఉద్యోగులపై ఈసీకి బీజేపీ నేతల ఫిర్యాదు

మునుగోడులో టీఎన్జీవో ఉద్యోగులు సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ నేతలు ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు రాజేంద్రతో పాటు కొంతమంది టీఆర్ఎస్కు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి రూల్స్కు విరుద్ధంగా ప్రచారం చేసినందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాగార్జునసాగర్ ఎన్నిక సమయంలోనూ టీఎన్జీవోలు అధికార పార్టీకి అనుకూలంగా ప్రచారం చేశారని ఆరోపించారు. 

మరోవైపు రాజగోపాల్ రెడ్డి అకౌంట్ నుండి డబ్బులు బదిలీ అని వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చినట్లు బీజేపీ నేతలు తెలిపారు. అవన్నీ ఫేక్ అకౌంట్లు అని.. బీజేపీని దెబ్బతీసేలా టిఆర్ఎస్ పార్టీ కుట్రలు చేస్తోందని అడ్వొకేట్ రచనారెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ సర్వీస్ రూల్స్ చాలా క్లియర్గా ఉన్నాయని.. ఉద్యోగులు బహిరంగంగా ఎలాంటి పొలిటికల్ పార్టీకి ప్రచారం చేయొద్దన్నారు. మునుగోడులో ఉన్న బీజేపీ లీడర్ల ఫోన్ ట్యాపింగ్  వ్యవహారంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.