పార్క్ స్థలాలను కాపాడాలని రిలే దీక్షలు

పార్క్ స్థలాలను కాపాడాలని రిలే దీక్షలు

ఎల్బీనగర్, వెలుగు: అన్యాక్రాంతం అవుతున్న పార్క్ స్థలాలను కాపాడాలంటూ బీజేపీ కార్పొరేషన్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు బడంగ్​పేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట బుధవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శ్రీరాములుయాదవ్, రంగారెడ్డి జిల్లా రూరల్ మాజీ అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి మద్దతు తెలిపారు. కార్పొరేషన్ లో పార్కు స్థలాలు అన్యాక్రాంతం అవుతున్నాయని, తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు.