
గోవుల అక్రమ రవాణా మరియు గో సంరక్షకులపై దాడులను ఖండిస్తూ నిరసన తెలుపుతున్న బీజేపీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పిలుపు మేరకు.. గో మహార్యాలీ పేరుతో బీజేపీ నాయకులు శుక్రవారం ఉప్పల్‌లో నిరసన చేపట్టాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. అదుపులోకి తీసుకున్న నాయకులను ఉప్పల్, మేడిపల్లి పీఎస్‌లకు తరలించారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నల్లకుంట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నాయకుల అరెస్టులతో ఉప్పల్‌లో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఉప్పల్ ప్రధాన రహదారి మొత్తం పోలీసు బలగాలతో నిండిపోయింది. కాగా.. ఎట్టి పరిస్థితుల్లోనైనా గో మహర్యాలీ నిర్వహించి తీరుతామని బీజేపీ శ్రేణులు అంటున్నాయి.