PAK vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్..

PAK vs NZ: టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న పాక్..

PAK vs NZ: టీ20 వరల్డ్ కప్ లో భాగంగా జరిగే సూపర్–8 దశలో తొలి మ్యాచ్ లో పాకిస్థాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించింది. ఈ మ్యాచ్‌లో స్పిన్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఇరు జట్లు కూడా స్పిన్నర్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్నట్లు తెలుస్తుంది. దీంతో అభిమానులు ఉత్కంఠభరిత పోరుకు సిద్ధమవుతున్నారు. టాస్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా మాట్లాడుతూ.. మేము బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం.. మా జట్టులో ఒక మార్పు మాత్రమే చేశాం.. ఫఖర్ జమాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు, నఫయ్ ఆడటం లేదని తెలిపారు. ఫహీమ్ అష్రఫ్ ఒకే ఒక పేస్ ఆల్‌రౌండర్‌గా ఉన్నాడు.. మొత్తం ఇద్దరు పేసర్లు, ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.. న్యూజిలాండ్ బలమైన జట్టు, అందుకే మా టీంతో వారిని కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నామని సల్మాన్ ఆఘా పేర్కొన్నారు. 
 
న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మా జట్టులో మూడు మార్పులు చేశాం.. కైల్ జేమీసన్ స్థానంలో అదనపు స్పిన్నర్ గా ఇష్ సోధిని తీసుకున్నాం.. అలాగే డఫీ స్థానంలో లాకీ ఫెర్గూసన్ తిరిగి జట్టులోకి వచ్చాడు, చెన్నైతో పోలిస్తే ఇక్కడి పిచ్ పరిస్థితులు కొంచెం భిన్నంగా ఉండొచ్చు.. ఈ వేదికలో జరిగిన మ్యాచ్‌లను గమనించాం.. పాకిస్థాన్‌కు మంచి స్పిన్నర్లు ఉన్నారు.. ఈ మ్యాచ్ ఆసక్తికరంగా ఉంటుందని వెల్లడించాడు.  

►ALSO READ | Abhishek Sharma: నా బ్యాటింగ్ స్టైల్ గింతే.. మారడాలు, మార్చుకోవడాలు ఉండవ్ ఇక్కడ..! 

న్యూజిలాండ్: టిమ్ సీఫెర్ట్ (వికెట్ కీపర్), ఫిన్ అలెన్, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్, మార్క్ చాప్మన్, డారిల్ మిచెల్, మిచెల్ సాంట్నర్( కెప్టెన్), జేమ్స్ నీషమ్, మాట్ హెన్రీ, ఇష్ సోధి, లాకీ ఫెర్గూసన్.

పాకిస్థాన్: సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా (కెప్టెన్), బాబర్ ఆజం, ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్), షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ మీర్జా, ఉస్మాన్ తారిఖ్