Abhishek Sharma: టీ20 ప్రపంచ కప్ 2026లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ ఈ టోర్నీలో ఘోరంగా విఫలమైన విషయం తెలిసిందే. ఆడిన మూడు మ్యాచుల్లోనూ వరుసగా డకౌట్లు అయి పెవిలియన్ చేరాడు. దీంతో అతడి ఫామ్‌పై క్రికెట్ పండితులు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ టీ20 ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న అభిషేక్ ఒక్కసారిగా ఫామ్ కోల్పోవడంపై పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. కాగా సూపర్– 8లో భాగంగా రేపు (ఫిబ్రవరి 22న) సౌతాఫ్రికా వర్సెస్ భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అభిషేక్ శర్మ వరుస డకౌట్లపై మీడియా వేదికగా స్పందించాడు.
నాకు బ్యాటింగ్ అంటే ఎంతో ఇష్టం.. రెండేళ్ల క్రితం నుంచే ఇలాంటి చిన్న విషయాలను పట్టించుకుని ఒత్తిడి తీసుకోవడం మానేశా అని అభిషేక్ శర్మ వెల్లడించాడు. నేను నా హార్డ్ వర్క్‌ని మాత్రమే నమ్ముతాను.. మన చేతిలో ఉండేది కేవలం ప్రాక్టీస్ చేయడం మాత్రమే, ట్రైనింగ్ కూడా అంతే.. వాటినే నేను ఎక్కువగా కొనసాగిస్తా.. కెరీర్లో ఎత్తుపల్లాలు కామన్.. కొన్ని ఇన్నింగ్స్‌ల్లో రన్స్ వస్తాయి.. కొన్నిసార్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తుంది.. కానీ నేను నిర్ణయించుకున్నది మాత్రం ఒక్కటే.. ఏం జరిగినా నా బ్యాటింగ్ శైలిలో మార్పులు చేయను అని తేల్చి చెప్పాడు. ఫలితం రాకపోయినా ఫర్వలేదు నా ఆటతీరును మాత్రం మార్చుకునే ప్రసక్తి లేదు.. ఇదే దూకుడును కొనసాగిస్తానని అభిషేక్ శర్మ వెల్లడించాడు.
►ALSO READ | INDW vs AUSW 3rd T20: భారత్ ఘన విజయం.. 2–1 తేడాతో ఆస్ట్రేలియాపై సిరీస్ కైవసం
టీ20 ప్రపంచ కప్ లోని గ్రూప్-1లో ఉన్న భారత్ జట్టు సూపర్-8లో తొలి మ్యాచ్‌ను దక్షిణాఫ్రికాతో ఆడనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రేపు (ఫిబ్రవరి 22న) రాత్రి 7 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. లీగ్ మ్యాచులలో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన 3 మ్యాచులలో వరుసగా డకౌట్లు కావడంతో భారత క్రికెట్ అభిమానులతో పాటు క్రీడా విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
“I won’t ever change my process and mindset.” 📈#AbhishekSharma ‘BELIEVES’ in himself as India march into the Super 8 vs #SouthAfrica. 💪
— Star Sports (@StarSportsIndia) February 21, 2026
Predict his score against South Africa in the comments.🧐
ICC Men’s #T20WorldCup SUPER 8 👉 #INDvSA | SUN, 22 FEB, 6 PM pic.twitter.com/kgNbhfsWC1
