అమరావతి: తిరుపతి లడ్డూ ఇష్యూను మాపై నెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తు్న్నారని సీఎం చంద్రబాబు అన్నారు. శనివారం (ఫిబ్రవరి 21) పల్నాడు జిల్లాలోని వినుకొండలో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తిరుపతి లడ్డూ కల్తీ దర్యాప్తులో వైఎస్ఆర్సీపీ నాయకులు అనేక అడ్డంకులు సృష్టించారని, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారని పేర్కొన్నారు.
లడ్డూ నెయ్యి కల్తీ కేసు నుంచి తప్పించుకోవడానికి మాపై అభాండాలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి స్వచ్ఛమైంది కాదని సీబీఐ నేతృత్వంలోని సిట్ గుర్తించిందని తెలిపారు. 2019 నుంచి 2024 మధ్య తిరుమలలో కల్తీ లడ్డూలను వడ్డించారని ఆరోపించారు.
►ALSO READ | VSR కంపెనీకి టీడీపీతో సంబంధం.. రామ్మోహన్ నాయుడు రాజీనామా చేయాలి: రోహిత్ పవార్
వైసీపీ హయాంలో మీరు తిరుపతి లడ్డు తిన్నారా..? తిరుపతిలో భోజనం చేసినప్పుడు మీకు నెయ్యి సువాసన వచ్చిందా అని ప్రజలను ప్రశ్నించారు. వైసీపీ చివరకు తిరుమల శ్రీవారిని కూడా వదిలిపెట్టలేదని మండిపడ్డారు. కోట్లాది మంది భక్తులు గౌరవించే తిరుమల లడ్డూను జంతువుల కొవ్వులతో పాటు బాత్రూమ్‌లను శుభ్రం చేయడానికి ఉపయోగించే రసాయనాలతో కల్తీ చేశారని బాబు ధ్వజమెత్తారు.
