హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదేండ్ల పాటు మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసినా జూబ్లీహిల్స్ లో ఎలాంటి అభివృద్ధి చేయలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని చెబుతున్నారని.. ఏ ముఖంతో ఓట్లడిగేందుకు ఆయన వస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు.
శనివారం హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ ఇందిరానగర్ లో పాయల్ శంకర్ మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్‌ఎస్ పాలనలో మోసాలు, రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో దోపిడీలు జరిగాయన్నారు. ప్రజలు ఈ రెండు పార్టీలను ఓడించి, బీజేపీకి ఓటు వేయాలని కోరారు. జూబ్లీహిల్స్ బైపోల్ లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించాలన్నారు.
