స్మితా సబర్వాల్​కు రఘునందన్​ రావు కౌంటర్

స్మితా సబర్వాల్​కు రఘునందన్​ రావు కౌంటర్
  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లోని ఘటనలపై మాత్రమే స్పందిస్తారా
  • మీరు పని చేస్తున్న రాష్ట్రంలోని ఘటనల పైనా ట్వీట్​ చేయండి: 
  • ‌‌స్మితా సబర్వాల్ కు దుబ్బాకా ఎమ్మెల్యే రఘునందన్​ సూచన

తెలంగాణ సీనియర్​ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్​కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​ రావు కౌంటర్​ఇచ్చారు.   ఇటీవల ఆమె వివిధ అంశాలపై సామాజిక మాధ్యమాల ద్వారా చేస్తున్న పోస్టులు చర్చానీయంశం అవుతున్నాయి.  ఈ క్రమంలో ఆమె ఇటీవల జరిగిన మణిపూర్​ ఘటనపై స్పందించిన ఆమెకు తాజాగా రఘునందన్​రావు కౌంటర్​ ఇచ్చారు. నల్గొండ జిల్లాలో దళిత మహిళపై ఓ సర్పంచ్​ రక్తం వచ్చేలా దాడి చేశారు. దీనిపై స్పందించాలని ఆయన డిమాండ్​ చేశారు.  బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగే సంఘటనపై సత్వరమే స్పందించి ట్వీట్లు పెట్టే మీరు బాధ్యతలు నిర్వహిస్తున్న రాష్ట్రంలో జరిగిన ఈ ఘటనపై కూడా సత్వరమే స్పందించాలని కోరుకుంటున్నాం అని ఆయన ట్వీట్​ చేశారు.  దీనపై నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.  అత్యున్నత స్థాయిలో ఉన్న మీరు ఎందుకని సెలెక్టివ్​గా ఆలోచిస్తున్నారంటూ నిలదీస్తున్నారు. ఈ విమర్శలపై స్మితా సబర్వాల్​ ఎలా స్పందిస్తారో చూడాలి.