
- రాజాసింగ్ వ్యాఖ్య
హైదరాబాద్, వెలుగు: పార్టీకి కొత్త అధ్యక్షుడిని స్టేట్ కమిటీ డిసైడ్చేస్తుందా లేదా సెంట్రల్ కమిటీనా అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రశ్నించారు. అధ్యక్షుడిని స్టేట్కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్స్టాంప్ లా మారిపోతారని, సెంట్రల్కమిటీనే డిసైడ్చేస్తే బాగుంటుందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గతంలో ఎవరు అధ్యక్షులైనా గ్రూపులను తయారు చేసుకుని పార్టీకి నష్టం చేశారని తెలిపారు.
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, జైలుకు వెళ్లిన వాళ్లను గతంలో పక్కనపెట్టారని చెప్పారు. ప్రస్తుతం పార్టీలోని మంచి నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేల చేతులను కట్టి పడేశారన్నారు. కొత్త అధ్యక్షుడు వస్తే పార్టీలో గ్రూపిజం తగ్గుతుందని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే రాష్ట్రంలో కచ్చితంగా బీజేపీ ప్రభుత్వం వస్తుందని పేర్కొన్నారు.