ఇవాళ్టి ( ఫిబ్రవరి 8 ) నుంచి కాచిగూడ- నర్సాపూర్ మధ్య స్పెషల్ ట్రైన్

ఇవాళ్టి ( ఫిబ్రవరి 8 ) నుంచి కాచిగూడ- నర్సాపూర్ మధ్య స్పెషల్ ట్రైన్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కాచిగూడ– నర్సాపూర్​ మధ్య వన్​వే స్పెషల్​ట్రైన్​ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. కాచిగూడ – నర్సాపూర్ (ట్రైన్​నెం.07510 ) కు ఆదివారం నుంచి ఈ నెల 11వరకు ఈ రైలు సర్వీసులు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. 

ఈ ట్రైన్ ప్రతి రోజూ సాయంత్రం 4.40 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం6.40గంటలకు తిరిగి చేరుకుంటుందని చెప్పారు. ఈ రైలుకు మల్కాజ్ గిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్​లో  స్టాప్ ఉంటుందని పేర్కొన్నారు.