సైక్లింగ్తో ఆరోగ్యం..మంత్రి జూపల్లి కృష్ణారావు

సైక్లింగ్తో ఆరోగ్యం..మంత్రి జూపల్లి కృష్ణారావు

కొల్లాపూర్, వెలుగు:సైకిల్​ తొక్కితే ఆరోగ్యంగా ఉండవచ్చని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం ఆయన నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో సైకిల్‌పై తిరుగుతూ వినూత్న ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆధునిక జీవనశైలిలో శారీరక శ్రమ తగ్గి అనేక ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయన్నారు. సైకిల్ వినియోగం ఆరోగ్యానికి మేలు చేయడమే కాకుండా కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని పేర్కొన్నారు. సాధ్యమైనంతవరకు సైకిల్ వినియోగించాలని పిలుపునిచ్చారు.