అక్బరుద్దీన్ కేసు కొట్టివేతపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

అక్బరుద్దీన్ కేసు కొట్టివేతపై రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: విద్వేష పూరిత ప్రసంగాలు చేశారనే అభియోగంతో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై నమోదైన రెండు కేసులను నాంపల్లి కోర్టు బుధవారం కొట్టివేసింది. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు. తమకో  న్యాయం, ఎంఐఎం వాళ్లకు మరో న్యాయమా అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక తన ట్విట్టర్ అకౌంట్ లో రజినీకాంత్ హీరోగా నటించిన ‘అంధా కానూన్’ సినిమా పోస్టర్ ను షేర్ చేశారు.

నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో పదేళ్ల కింద అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర దుమారం రేగింది. విద్వేష పూరిత ప్రసంగాలు చేశారంటూ పోలీసులు ఐపీసీ 120 బీ, 153 ఏ, 295, 188 సెక్షన్ల కింద సుమోటోగా కేసులు నమోదు చేశారు. ఈ కేసులో 2013 జనవరి 8న అరెస్టయిన అక్బరుద్దీన్ 40 రోజుల పాటు జైల్లో ఉన్నారు. ఈ రెండు కేసులకు సంబంధించి నిర్మల్ లో మొదటగా నమోదైన ఎఫ్ఐఆర్ ను మాత్రమే ప్రధాన కేసుగా భావించి నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టులో విచారణ చేయాలని హైకోర్టు ఆదేశించింది. సుదీర్ఘ విచారణల తర్వాత  నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఎలాంటి ఆధారాలు పోలీసులు సమర్పించకపోవడం వల్లే కోర్టు కేసును కొట్టేసిందని అక్బరుద్దీన్ తరపు న్యాయవాది తెలిపారు. 
 

ఇవి కూడా చదవండి..

కేసీఆర్ చేసిన తప్పుకు రైతులు బలయ్యారు

కేసీఆర్ అరెస్ట్ కావడం ఖాయం