బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ

బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హైకోర్టులో విచారణ

హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్పై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. స్పీకర్ నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోబోదంటూ సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్ ను సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన హైకోర్టు.. అసెంబ్లీ కార్యదర్శికి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు నోటీసులు ఇవ్వాలని రిజిస్ట్రార్ కు ఆదేశాలు జారీ చేసింది. ఈ రోజు సాయంత్రం 4గంటల లోపు ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభకు అంతరాయం కలిగిస్తున్నారంటూ… బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్, ఈటెల రాజేందర్ లను సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యేలు న్యాయపోరాటం చేస్తున్నారు. తమను అన్యాయంగా సస్పెండ్ చేసినట్లు హైకోర్ట్ ను ఆశ్రయించారు.

మరిన్ని వివరాల కోసం...

సోనియా రాజీనామా చేయాల్సిన అవసరంలేదు

మణిపూర్ సీఎం ఎంపికపై తర్జనభర్జన