అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం

అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల ప్రమాణం

అసెంబ్లీలో 8 మంది  బీజేపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, కామారెడ్డి ఎమ్మెల్యే  వెంకటరమణా రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్​శంకర్, నిర్మల్ ఎమ్మెల్యే  ఏలేటి మహేశ్వర్​రెడ్డి, సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్ బాబు,ముథోల్ ఎమ్మెల్యే రాంరావ్ పవార్ పాటిల్, ఆర్మూర్ నుంచి గెలిచిన పైడి రాకేష్ రెడ్డలతో   స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్   ప్రమాణ స్వీకారం చేయించారు. 

 డిసెంబర్ 10న 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. అపుడు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఉండటంతో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయలేదు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఎన్నికను వ్యతిరేకించారు బీజేపీ సభ్యులు. అప్పటి నుంచి అసెంబ్లీకి రాలేదు. దీంతో డిసెంబర్ 14న కొత్త స్పీకర్ గా గడ్డం ప్రసాద్ కుమార్ ఎన్నిక కావడంతో బీజేపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారు. ప్రమాణ స్వీకారం చేశారు. 

అంతకు ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి..  బీఆర్ ఎస్  నుంచి కేటీఆర్, కడియం శ్రీహరి,కొత్త ప్రభాకర్ రెడ్డి,   పద్మారావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డితో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఓవైసీ   ప్రమాణ స్వీకారం చేయించారు.  దీంతో ఇప్పటి వరకు 117 మంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఇంకా మాజీ సీఎం కేసీఆర్ తో పాటు, మిర్యాలగూడ ఎమ్మెల్యే  బత్తుల లక్ష్మారెడ్డి ప్రమాణ స్వీకారం చేయలేదు.