- కేంద్ర మంత్రి అమిత్‌షాకు బీజేపీ ఢిల్లీ ఎంపీ లేఖ ప్రవీణ్
- పాండవుల విగ్రహాలు ఏర్పాటు చేయలని వినతి
న్యూఢిల్లీ: ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. ఆ పేరు ఇక్కడి చారిత్రక, సాంస్కృతిక మూలాలను ప్రతిబింబిస్తుందని చెప్పారు. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, రామ్ మోహన్ నాయుడు, గజేంద్ర సింగ్ షెకావత్‌కు కూడా లేఖలు రాశాడు. ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్‌ను ఇంద్రప్రస్థ జంక్షన్‌గా, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇంద్రప్రస్థ ఇంటర్నేషనల్ఎయిర్పోర్ట్గా మార్చాలని కోరాడు.
అలాగే, పంచ పాండవుల భారీ విగ్రహాలను ఢిల్లీలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇది భారత చరిత్ర, సంస్కృతి, విశ్వాసాలను కొత్త తరానికి తేలియజేస్తుందని తెలిపారు. ప్రధాని మోదీ సాంస్కృతిక పునరుజ్జీవం దార్శనికతకు అనుగుణంగా ఉంటుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఆధునిక సిటీ మాత్రమే కాదని భారత నాగరికత కు ఆత్మ లాంటిదని పేర్కొన్నారు. అయోధ్య, కాశీ, ఉజ్జయిని ప్రయాగ్‌రాజ్ వలె ఢిల్లీ కూడా చారిత్రక గుర్తింపు పొందాలని అన్నారు. వీహెచ్‌పీ కూడా గత నెలలో ఢిల్లీ పేరును ఇంద్రప్రస్థగా మార్చాలని డిమాండ్ చేసింది.
