
తెలంగాణ రాష్ట్రంలో జరుగుబోతున్న దుబ్బాక ఉప ఎన్నికలు ఒక చరిత్ర ను సృష్టించబోతున్నాయని, టీఆర్ఎస్ పతనానికి నాంది పలకబోతున్నాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. ఎన్నికలు జరగకముందే టీఆర్ఎస్ నేతలకు ఓటమి భయం పట్టుకున్నదని.. బీజేపీ అభ్యర్థి కారు తో పాటు, వారి బంధువుల ఇళ్లపై సోదాలు చేశారన్నారు. ఎక్కడా డబ్బులు దొరకకపోవడంతో పక్కింటి నుండి తీసుకువచ్చారన్నారు. ఎలాగైనా గెలవాలని మంద బలం తో బీజేపీ కార్యకర్తలను బెదిరిస్తున్నారన్నారు.
స్టార్ క్యాంపెయినర్ లు ఎక్కడికైనా వెళ్లొచ్చని.. ఎన్నికల కమిషన్ అనుమతి ఇచ్చిందని.. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సిద్దిపేట కి చేరుకోకముందే కమిషనర్ అరెస్ట్ చేసి కరీంనగర్ తీసుకెళ్లారన్నారు ఇంద్రసేనా రెడ్డి. తమ పార్టీ కార్యకర్తలను డబ్బులు పంచుతున్నాని పోలీసులు బలవంతపెడుతూ ,కొడుతూ వారి నుండి అబద్ధాలు చెప్పిస్తున్నారన్నారు.
లోకల్ పోలీసుల మీద తమకు నమ్మకం లేదని, సీఈవో ను కలిసి వినతిపత్రం ఇచ్చామన్నారు. సెంట్రల్ పోలీసుల ఆధ్వర్యంలో ఎన్నికలు జరపాలని, ఎన్నికల అబ్ జర్వ్ లాగానే పోలీసుల అబ్ జర్వ్ ఉండాలన్నారు. సిద్దిపేట పొలీస్ కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలన్నారు ఇంద్రసేనా రెడ్డి.