సీఎం అఖిలపక్ష భేటీకి బీజేపీ డుమ్మా

సీఎం అఖిలపక్ష భేటీకి బీజేపీ డుమ్మా

దళితుల అభివృద్ధి, సంక్షేమంపై కాసేపట్లో  సీఎం KCR అధ్యక్షతన ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయబోతున్న దళిత్ ఎంపవర్ మెంట్ స్కీంపై సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఈ స్కీం కింద వెయ్యి కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ఈ మీటింగ్ జరగనుంది. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలకు చెందిన ఎస్సీ ప్రజా ప్రతినిధులకు ఆహ్వానం పంపారు. మజ్లిస్ నేతలతో పాటు సీపీఐ నుంచి చాడ వెంకట్ రెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రంలను మీటింగ్‌కు హాజరుకావాలని కోరారు. సీనియర్ ఎస్సీ నేతలు కడియం శ్రీహరి, మోత్కుపల్లి, మందా జగన్నాథం వంటి ఇతర నేతలకు కూడా ఆహ్వానం పంపారు. అయితే ఈ అఖిలపక్ష భేటీకి బీజేపీ మాత్రం హాజరుకావటం లేదని ప్రకటించింది.