
హైదరాబాద్, వెలుగు: -జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొనే స్టార్ క్యాంపెయినర్ల జాబితాను బీజేపీ రాష్ట్ర కమిటీ విడుదల చేసింది. మొత్తం 40 మంది ముఖ్య నేతలతో కూడిన ఈ జాబితాలో కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్య నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
ప్రధానంగా కేంద్రమంత్రులు నిర్మలాసీతారామన్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అర్జున్ రామ్, శ్రీనివాస్ వర్మతో పాటు రాజస్తాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్రావు, ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేశ్, ఆర్.కృష్ణయ్య, పార్టీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జాతీయ నేతలు తేజస్వీ సూర్య, అన్నామలై, పురందేశ్వరి, సునీల్ భన్సల్, అభయ్ పాటిల్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్క కొమురయ్య, అంజిరెడ్డి, పాయల్ శంకర్ తదితరులు ఉన్నారు. కాగా, గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు నుంచి అభ్యర్థి దీపక్ రెడ్డి బీఫామ్ అందుకున్నారు. శుక్రవారం ఫస్ట్ సెట్ నామినేషన్, 21న ఫైనల్ సెట్ నామినేషన్ వేయనున్నారు.