మే 25 నుంచి రైతు గోస.. రైతులకు మద్దతుగా బీజేపీ పోరుబాట

మే 25  నుంచి రైతు గోస..  రైతులకు మద్దతుగా బీజేపీ పోరుబాట
  • బీజేపీ భరోసా’ పేరుతో నిరసనలు 

హైదరాబాద్, వెలుగు: ప్రజా.. రైతు పోరాటాలకు బీజేపీ రెడీ అయింది. రైతు గోస... బీజేపీ భరోసా పేరుతో పోరుబాట పట్టనుంది. మూడు రోజుల పాటు సాగనున్న ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. సోమవారం నుంచి రైతులకు అండగా కొనుగోలు కేంద్రాల వద్ద నిరసనల్లో పాల్గొని, రైతులతో మాట్లాడి సమస్యలు, ఇబ్బందులను తెలుసుకోనున్నారు. 

ఉదయం నుంచి సాయత్రం వరకు రైతు కొనుగోలు కేంద్రాల వద్ద బీజేపీ నేతలు ఉండనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆధ్వర్యంలో జరగనున్న ఈ పోరుబాటలో పార్టీ వ్యవహారాల ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి అభయ్ పాటిల్ పాల్గొననున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. వరి, మొక్కజొన్న పంట కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ని ఆరోపిస్తూ బీజేపీ ఈ పోరు బాట చేపట్టనుంది.