బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా విడుదల.. 40 మంది ఎంపిక

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితా విడుదల.. 40 మంది ఎంపిక

హైదరాబాద్, వెలుగు :  అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో పాల్గొనే నేతలను బీజేపీ అధిష్టానం ఖరారు చేసింది. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో 40 మందికి చోటు కల్పించింది. ఈ లిస్ట్​లో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్​నాథ్ సింగ్, పీయూష్​ గోయల్, స్మృతి ఇరానీ, పురుషోత్తం రుపాల, నిర్మల సీతారామన్, కిషన్ రెడ్డి, పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఉన్నారు.

యూపీ సీఎం యోగి, కర్నాటక మాజీ సీఎం యడ్యూరప్ప, అర్జున్ ముండా, భూపేంద్ర యాదవ్, సాధ్వి నిరంజన్ జ్యోతి, మురుగన్, ఎంపీలు సంజయ్, అర్వింద్, లక్ష్మణ్​తో పాటు మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలను ఎంపిక చేసింది. కాగా, జాబితాలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు, మాజీ ఎంపీ విజయశాంతి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్లు లేకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది. వెంటనే తేరుకున్న బీజేపీ హైకమాండ్.. దిద్దుబాటు చర్యలో భాగంగా ఇద్దరి పేర్లను చేరుస్తూ సోమవారం రాత్రి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియాకు ప్రెస్​నోట్ విడుదల చేశారు.