పోరాడితే తప్ప హైకోర్టు తీర్పు అమలు కాలేదు : బండి సంజయ్

పోరాడితే తప్ప హైకోర్టు తీర్పు అమలు కాలేదు : బండి సంజయ్

ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్షల్లో మల్టిపుల్ జవాబులున్న ప్రశ్నలకు మార్కులు కలపాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది బీజేవైఎం కార్యకర్తలు, ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థుల పోరాటం వల్లే సాధ్యమైందన్నారు. హైకోర్టు ఆదేశాల అమలు కోసం పోరాడితే తప్ప స్పందించని నియంత ప్రభుత్వం రాష్ట్రంలో కొనసాగడం దురదృష్టకరమన్నారు. 317 జీవోను సైతం సవరించి స్థానికత ఆధారంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లున్న స్కూల్ అసిస్టెంట్లకు మాత్రమే స్పౌజ్ బదిలీలను వర్తింపజేయడం అన్యాయమని మండిపడ్డారు. స్కూల్ అసిస్టెంట్లతోపాటు ఎస్జీటీ టీచర్లకూ స్పౌజ్ బదిలీల్లో అవకాశం కల్పించాలని చెప్పారు.