రెబెల్స్ పై బీజేపీ చర్యలు.. కేంద్ర మాజీ మంత్రిపై వేటు! ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు

రెబెల్స్ పై బీజేపీ చర్యలు.. కేంద్ర మాజీ మంత్రిపై వేటు!  ముగ్గురు నేతలకు షోకాజ్ నోటీసులు

పాట్నా: బిహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపొందిన అనంతరం రెబెల్స్ పై బీజేపీ వేటేయడం మొదలుపెట్టింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ తో సహా మరో ఇద్దరు నేతలను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వివరణ ఇవ్వాలంటూ ముగ్గురు నేతలకు షోకాజ్‌‌ నోటీసులు జారీ చేసింది. 

ఎమ్మెల్సీ అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్, ఆయన భార్య ఉషా అగర్వాల్, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్‌‌ ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు తెలిపింది. అశోక్ అగర్వాల్ దంపతులు వికాస్ శీల్ ఇన్సాన్ పార్టీ టికెట్ పై కతిహార్ అసెంబ్లీ నుంచి పోటీ చేసిన వారి కుమారుడు సౌరభ్ కోసం ప్రచారం నిర్వహించారు. ఆ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా తర్కిషోర్ ప్రసాద్ బరిలో నిలిచారు. కేంద్ర హోంశాఖ సెక్రటరీగా 2014లో ఆర్కే సింగ్ పదవీ విరమణ చేశారు. అనంతరం బీజేపీలో చేరారు.