- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు
హైదరాబాద్, వెలుగు: తెలుగు రాష్ట్రాల జీవన విధానానికి, గ్రామీణ సంప్రదాయాలకు సంక్రాంతి పండుగ దర్పణం పడుతున్నదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. రాష్ట్ర ప్రజలందరికి ఆయన మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
ఏడాది పొడవునా రెక్కలు ముక్కలు చేసుకునే రైతుకు ఫలితం దక్కే పండుగ ఇదని, కుటుంబాలను, గ్రామాలను కలిపే మహత్తర ఉత్సవమని ఆయన అభివర్ణించారు. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల పాత్రను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని రాంచందర్ రావు కోరారు.
