హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు పూర్తయినా ఇచ్చిన ఆరు గ్యారంటీలు సహా హామీలేవీ అమలు కాలేదని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు విమర్శించారు. ఈ ప్రజావంచనను ఎండగట్టేందుకు ఈ నెల 7న హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ‘మహాధర్నా’ నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ధర్నా పోస్టర్‌ను వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కల్యాణ్ నాయక్ తో కలిసి గౌతమ్‌రావు ఆవిష్కరించారు. ‘గల్లంతైన గ్యారంటీలు – నెరవేరని వాగ్దానాలు’ అనే నినాదంతో మహాధర్నా చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.
