బీజేపీ విజయ సంకల్ప యాత్ర..5 యాత్రలు 5,500 కి.మీ

బీజేపీ విజయ సంకల్ప యాత్ర..5 యాత్రలు 5,500 కి.మీ

ఫిబ్రవరి 20న  నుంచి మార్చి 2వ తేదీ వరకు  బీజేపీ విజయసంకల్ప యాత్ర  కొనసాగుతోంది. నారాయణ పేట జిల్లా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ యాత్రను మొదలు పెట్టనున్నారు.  రాష్ట్రంలో 5 విభాగాలుగా ఈ  యాత్ర జరుగుతుంది. మొత్తం 5 యాత్రల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ ఉంటాయి.సమ్మక్క సారక్క జాతర సందర్భంగా వరంగల్ వైపు జరిగే యాత్ర మూడు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది.ఈ రోజు నుండి 4 యాత్రలు కొనసాగుతాయి. ఈ విజయ సంకల్ప యాత్రకు పార్టీ జాతీయ నేతలు హాజరవుతారు.

1) కొమరంభీం విజయ సంకల్ప యాత్ర...

బాసర సరస్వతి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్న తర్వాత భైంసా నుండి ప్రారంభమవుతుంది.ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి పార్లమెంట్లలో కొమరంభీం విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది. సుమారు 1,056 కి.మీ మేర 12 రోజులు జరుగుతుంది. 21 నియోజకవర్గాలల్లో ఈ యాత్ర కొనసాగుతుంది.

2) రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర

కరీంనగర్, చేవెళ్ల, మెదక్, జహీరాబాద్ పార్లమెంట్లలో 1,217 కి.మీ ఉంటుంది. 22 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ యాత్ర కొనసాగుతుంది. మిగిలిన నియోజకవర్గాలను కూడా కవర్ చేసేలా కార్యాచరణ

3) భాగ్యనగర విజయ సంకల్ప యాత్ర

యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామివారి ఆశీస్సులుతో ఈ యాత్ర ప్రారంభమవుతుంది. భువనగరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజ్ గిరి పార్లమెంట్లలో ఈ యాత్ర సాగుతుంది. 

4) కాకతీయ భద్రకాళి విజయ సంకల్ప యాత్ర

సమ్మక్క సారక్క జాతర కారణంగా రెండు రోజులు ఆలస్యంగా ప్రారంభమవుతుంది. ఈ యాత్ర భద్రాచలంలో ప్రారంభమవుతుంది.వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం పార్లమెంట్లలో 1,015 కి.మీ,7 రోజులు..  21 నియోజకవర్గాలను కవర్ చేస్తుంది.

5) కృష్ణమ్మ విజయ సంకల్ప యాత్ర

మక్తల్ నియోజకవర్గంలోని  కృష్ణా గ్రామం సమీపంలో కృష్ణా నది వద్ద పూజలు చేసి  ఈ యాత్ర ప్రారంభమవుతుంది.మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్లగొండ పార్లమెంట్లలో ఈ యాత్ర ఉంటుంది. 21 అసెంబ్లీ నియోజకవర్గాలలో 1,440 కి.మీ మేర యాత్ర కొనసాగనుంది.

ఏ యాత్ర ఎవరు ప్రారంభిస్తారు..

  • అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ  బాసర నుండి ప్రారంభమయ్యే కొమరం భీం విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు.
  • వికారాబాద్ జిల్లా తాండూర్ లో ప్రారంభమయ్యే రాజరాజేశ్వర విజయ సంకల్ప యాత్ర కేంద్ర మంత్రి బీఎల్ వర్మ  ప్రారంభిస్తారు.
  • యాదాద్రి టెంపుల్ నుండి ప్రారంభమయ్యే భాగ్యనగర విజయ సంకల్ప యాత్రను గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్  ప్రారంభిస్తారు.
  • కృష్ణా గ్రామంలో ప్రారంభమయ్యే కృష్ణా విజయ సంకల్ప యాత్రను కేంద్రమంత్రి పురుషోత్తం రూపాల ప్రారంభిస్తారు.
  • ఈ యాత్రలు సభలు మాత్రమే కాకుండా రైతులు, చేతి వృత్తులకు,  నిరుద్యోగలు, పొదుపు సంఘాల వారితో మీటింగ్స్ ఏర్పాటు చేసుకుంటూ రోడ్ షోల ద్వారా ముందుకు వెళ్తుంది.బహిరంగ సభలు ఎక్కడా ఉండవు. అన్ని యాత్రలలో రోడ్ షోలు మాత్రమే

5 యాత్రలు 5,500 కి.మీ

  •  17 పార్లమెంటు నియోజకవర్గాల ప్రజలను కలుస్తారు.
  • 119 నియోజకవర్గాలలలో 114 నియోజకవర్గాలలో యాత్ర వెళ్తుంది.
  • మొత్తం 5 యాత్రలల్లో 106 సమావేశాలు, 102 రోడ్ షోలు, 180 రిసెప్షన్స్, 79 ఈవెంట్స్ ఉంటాయి
  • మార్చి 2వ తేదీ వరకు యాత్రలు పూర్తి