ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తం: కిషన్ రెడ్డి

ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తం: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 119 స్థానాల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికలపై ఎలక్షన్ కమిటీ వేశామని, ఈ కమిటీ మీటింగ్ తర్వాత అన్ని అంశాలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మంగళవారం ఢిల్లీలోని సామ్రాట్ హోటల్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.

బీజేపీ క్యాడర్ బేస్డ్ పార్టీ అని, బీఆర్ఎస్  కుటుంబ పార్టీ మాదిరిగా డైనింగ్ టేబుల్ పై అభ్యర్థులను నిర్ణయించలేమని విమర్శించారు. క్యాడర్ తో మాట్లాడిన తర్వాతే అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తామన్నారు. సెప్టెంబర్ 17 రాష్ట్ర విమోచన దినోత్సవం తర్వాత రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేపడతామని చెప్పారు. ఎమ్మెల్యే రాజసింగ్ విషయంలో కేంద్ర పార్టీ సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందన్నారు.