ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను బీజేపీ అమలు చేస్తుంది : పినరయి విజయన్

ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండాను బీజేపీ అమలు చేస్తుంది : పినరయి విజయన్

కేంద్ర ప్రభుత్వంపై కేరళ సీఎం పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. ఎలక్టోరల్ బాండ్ స్కాంను దృష్టి మల్లించడం కోసం ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్టు చేశారని ఆరోపించారు. సంఘ్ పరివార్ రాజ్యాంగ సంస్థలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోందని, దేశ న్యాయవ్యవస్థను కూడా బెదిరిస్తోందని ఆరోపించారు. ఎలక్టోరల్ బాండ్ స్కాంపై సుప్రీంకోర్టు ఆదేశాలు కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి, సంఘ్ పరివార్ కి నష్టం చేకూరుస్తుందని అందరికీ  తెలుసన్నారు. 

సీఏఏ అనేది బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ ఎజెండా అని విజయన్ అన్నారు. 2019 నాటి CAA వ్యతిరేకంగా తాము నిరసనలు తెలుపుతుంటే, కాంగ్రెస్ మాత్రం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. నిరసనల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఎవరూ లేరని రాహుల్ గాంధీ విదేశాల్లో ఉన్నారని చెప్పారు. వామపక్ష నేతలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని గుర్తు చేశారు. 

ఆ అల్లర్లల్లో దాదాపు 53 మంది చనిపోయారని చెప్పారు. వందల మందికి పైగా గాయపడ్డారని అన్నారు. సంఘ్ నిర్వహించిన హింసలో అనేక మంది ముస్లింల ఇళ్లు, దుకాణాలు, స్థాపనలపై దాడులు జరిగాయని చెప్పారు.  వామపక్షాలు రాష్ట్రంలోని ఐదు చోట్ల భారీ CAA వ్యతిరేక ర్యాలీలు నిర్వహిస్తోంది.