- జనరల్ సెక్రటరీలుగా యశస్వీ, హరీశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: బీజేపీ యువ మోర్చా కొత్త కమిటీని ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు ఆదేశాల మేరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ కుండె.. 33 మందితో కొత్త కమిటీ జాబితా రిలీజ్ చేశారు. యువ మోర్చా జనరల్ సెక్రటరీలుగా హరిశ్వర్ రెడ్డి (నారాయణపేట), మల్కా యశస్వి (పెద్దపల్లి)లకు బాధ్యతలు అప్పగించారు.
ఉపాధ్యక్షులుగా ఎన్. ప్రవీణ్ రెడ్డి (కరీంనగర్), సందీప్ గౌడ్ (మహాంకాళి సికింద్రాబాద్), నితిన్ నందకర్ (గోల్కొండ గోషామహల్), అనిత రెడ్డి (రంగారెడ్డి అర్బన్), శరత్ చంద్ర (మేడ్చల్ అర్బన్), సిరిసాల సైనథ్ (వనపర్తి)లను ఉపాధ్యక్షులుగా నియమించారు. వీరే కాకుండా సెక్రటరీలు, ట్రెజరర్, మీడియా కన్వీనర్లు, సోషల్ మీడియా, ఐటీ విభాగాలకు కన్వీనర్లను నియమిస్తూ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన కమిటీతో పాటు 16మందితో రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీని కూడా ప్రకటించారు.
