బీజేపీది ప్రజల్లో చీలిక తెచ్చే మేనిఫెస్టో : తమ్మినేని

బీజేపీది ప్రజల్లో చీలిక తెచ్చే మేనిఫెస్టో : తమ్మినేని

హైదరాబాద్, వెలుగు: బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టో ప్రజల్లో చీలిక తేవడంతో పాటు సంక్షేమ పథకాలను కోత కోసేదిగా ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఆ పార్టీ కేంద్రంలో అధికారలో ఉన్నప్పటికి తెలంగాణను రాష్ట్రాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేసిందని తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఇవ్వలేదని,  విభజన చట్టాన్ని అమలు చేయలేదని విమర్శించారు. బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని కొన్ని అంశాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లోను అమలు కావడం లేదని చెప్పారు.

ఇక్కడ అమలు చేస్తామని చెప్పడం ప్రజలను మోసగించడమేనన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించి వాటికి ఎగనామం పెట్టిందని మండిపడ్డారు. పార్లమెంటులో చిన్న సవరణ చేస్తే ఎస్సీ వర్గీకరణ గతంలోనే అమలయ్యి ఉండేదని వెల్లడించారు. అయితే, ఎస్సీ వర్గీకరణ కోసం మళ్లీ కమిటీ వేస్తామనడం ఎన్నికల జిమ్మిక్కేనని చెప్పారు.