తెలంగాణలో టార్గెట్ 10 ఎంపీ సీట్లు

తెలంగాణలో టార్గెట్ 10 ఎంపీ సీట్లు
  • బీజేఎల్పీ నేత ఎంపికైనా చర్చ
  • లోక్ సభ ఎన్నికల్లో గెలుపుపైనే డిస్కషన్
  • తరుణ్ చుగ్, బన్సల్ హాజరు

హైదరాబాద్‌: పార్లమెంట్ ఎన్నికలకు కమలనాథులు రెడీ అవుతున్నారు. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు, 35 శాతం ఓటు బ్యాంకు సాధించడమే లక్ష్యంగా ఇవాళ సమావేశం నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ఇన్‌ఛార్జులు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, అరవింద్ మీనన్‌తోపాటు నేతలు బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్‌, డీకే అరుణ, ఈటల రాజేందర్‌, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మెజారిటీ సీట్లలో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. సంస్థాగతంగా పార్టీలో మార్పులు చేర్పులపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పార్టీ శాసనసభాపక్ష నేత ఎంపికపైనా సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ఎవరిని నియమించాలనేది ఇంకా క్లారిటీ రాలేదని తెలుస్తోంది. నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమిస్తారని ప్రచారం జరుగుతున్నా.. నిర్ణయం తీసుకోవడంలో తాత్సారం చేస్తుండటం గమనార్హం.