- బీజేపీ నేత ఎన్వీ సుభాశ్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రెండేండ్లలో రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ఇప్పుడు ‘రైజింగ్ తెలంగాణ’ అంటూ కాంగ్రెస్ సర్కార్ కొత్త నాటకానికి తెరలేపిందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్ ఆరోపించారు. రూ.2 లక్షల కోట్లకు పైగా కొత్త అప్పులు తెచ్చి, రాష్ట్రాన్ని దివాలా తీయించారని విమర్శించారు.
తమ ఫెయిల్యూర్లను కప్పిపుచ్చుకునేందుకే సీఎం రేవంత్ రెడ్డి ఖరీదైన పీఆర్ స్టంట్లు చేస్తున్నారని అన్నారు. గురువారం బీజేపీ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులకు టైంకు జీతాలు ఇస్తలేరు గానీ.. కోట్లు ఖర్చు పెట్టి సమిట్‌లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేండ్లల సర్కార్ చేసిన అప్పులెన్ని? ఈ సమిట్‌కు అయిన ఖర్చెంత? అనే దానిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలను గాలికొదిలేసిన కాంగ్రెస్ వైఖరికి నిరసనగా.. ఈ నెల 7న ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ‘మహాధర్నా’ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
