
రాష్ట్రంలోని నిరుద్యోగ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ లో అర్ధనగ్న ప్రదర్శన చేశారు BJYM నేతలు. 6 ఏళ్లుగా ఉద్యోగాల నియమకాలు జరగలేదని మండిపడ్డారు. వేల మంది నిరుద్యోగులు ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వెంటనే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని జిల్లా బీజేవైఎం అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేశారు జిల్లా BJYM నాయకులు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలన్నారు. నిరుద్యోగ యువతకి ఎన్నికల్లో ఇస్తానన్న నిరుద్యోగ భృతిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని కోరారు.
ఎన్నికల్లో టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను నేరవేర్చడంలో విఫలమైందని… నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో ధర్నా చేశారు బీజేవైఎం నేతలు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ఉద్యోగాల భర్తీ, EWS రిజర్వేషన్, ప్రైవేట్ టీచర్లని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అర్ధనగ్న ప్రదర్శన చేశారు బీజేవైఎం నేతలు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. నిరుద్యోగులందరికీ నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు.
కుమ్రంభీం జిల్లా ఆసిఫాబాద్ లో బీజేవైఎం నాయకులు అర్ధనగ్న రాస్తారోకో చేశారు. నిరుద్యోగులపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలని కోరారు. ప్రదర్శన చేస్తున్న నాయకుల్ని పోలీసులు అరెస్ట్ చేసి.. స్టేషన్ కి తరలించారు. నిరుద్యోగులు, ప్రైవేట్ టీచర్లకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామన్నారు BJYM నేతలు.