బ్లాక్ టీ..బ్లాక్ కాఫీ:  ఏది బెటర్?

బ్లాక్ టీ..బ్లాక్ కాఫీ:  ఏది బెటర్?

బ్లాక్ టీ మంచిదా? బ్లాక్ కాఫీ మంచిదా అని చాలామందికి డౌట్. అయితే రెండింటిల్లోనూ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. పోషకవిలువలు రెండింటిలోనూ ఉంటాయి. కానీ కెఫిన్ స్థాయిలో మాత్రం రెండింట్లోనూ కొంచెం తేడాలున్నాయి. అవేంటో తెలుసుకుంటే ఏం టైంలో ఏది తాగొచ్చో తెలుసుకోవచ్చు.

బ్లాక్ టీ

రోగ నిరోధక శక్తిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుంది. బ్లాక్ టీలో ఉండే పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోకి కెమికల్స్ వెళ్లకుండా చేస్తాయి. అవి బ్యాక్టీరియాతో పోరాడటమే కాకుండా ఎముకలను బలంగా చేస్తాయి. అందులో ఉండే రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు జీర్ణకోశాన్ని కూడా బలోపేతం చేస్తాయి. ఇందులో కెఫిన్ తక్కువగా ఉంటుంది. డయాబెటిస్, అల్జీమర్స్ వంటి కొన్ని వ్యాధుల నుంచి బ్లాక్ టీ రక్షిస్తుందని పరిశోధనలు చెప్పాయి.

బ్లాక్ కాఫీ

బ్లాక్ కాఫీలో ఎక్కువగా కెఫిన్ ఉంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగడం వల్ల వయసు పెరుగుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అందులో పొటాషియం, మెగ్నీషియంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటివల్ల రోజంతా యాక్టివ్‌గా ఉండొచ్చు. బద్ధకం వదలాలంటే ఒక కప్పు కాఫీ తాగాలి. డైలీ రెండు కప్పుల బ్లాక్ కాఫీ తాగితే లివర్ హెల్దీగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గడం, డిప్రెషన్ నుంచి బయటపడటం వంటి లాభాలున్నాయి. అయితే బ్లాక్ కాఫీ.. బ్లాక్ టీలు రెండింటిలోనూ మంచి పోషకాలున్నాయి. అయితే కెఫిన్ స్థాయిలో మాత్రం తేడాలున్నాయి. అందుకే బ్లాక్ కాఫీ తాగాలనుకునేవారు మరీ ఎర్లీ మార్నింగ్ కాకుండా ఉదయం పది లేదా పదకొండు గంటలకు తాగితే మంచిది. ఇక బ్లాక్ టీ తాగేవాళ్లు లేవగానే తాగడంబెటర్.