పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ

పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ భేటీ

హైదరాబాద్, వెలుగు: పీఆర్సీ కమిటీతో బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కమిటీ గురువారం సమావేశమైంది. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పీఆర్సీ కమిటీ చర్చలు జరుపుతోంది. ఈ క్రమంలోనే  బ్లైండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులను కమిటీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా అంధ ఉపాధ్యాయ, ఉద్యోగుల అవసరాలు, సమస్యలను పీఆర్సీ కమిటీకి అసోసియేషన్ నేతలు వివరించారు. ఈ చర్చల్లో  ప్రధానంగా కన్వీనియన్స్ అలవెన్స్, రీడర్ అలవెన్స్, అదనంగా 4 సాధారణ సెలవులు కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు కె.మల్లేశం, ప్రధాన కార్యదర్శి బి.రాఘవేందర్ రెడ్డి, కె.అనిల్ కుమార్, ఎన్.రవీందర్ పాల్గొన్నారు.

40%ఫిట్​మెంట్ ఇవ్వాలె

ఎంప్లాయీస్​కు 40% ఫిట్​మెంట్​తో పీఆర్సీ ఇవ్వాలని తెలంగాణ ఇంటర్మీడియెట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) కోరింది. ఈ మేరకు టిగ్లా రాష్ట్ర అధ్యక్షడు జంగ య్య, ప్రధాన కార్యదర్శి రామకృష్ణగౌడ్ గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. పట్టణాలకు, గ్రామాలకు మధ్య హెచ్ఆర్ఏ వ్యత్యాసాన్ని తగ్గించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. జీహెచ్ఎంసీలో 30%, ఇతర కార్పొరేషన్లలో 25%, మున్సిపాలిటీ ల్లో 20%, గ్రామాల్లో 15% హెచ్ఆర్ఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20 ఏండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులకు నెల వేతనంలో 50% పింఛన్ ఇవ్వాలన్నారు.