కళ్లకు గంతలు కట్టి నవవధువుపై ఫేక్ బాబా అత్యాచారం..

కళ్లకు గంతలు కట్టి నవవధువుపై ఫేక్ బాబా అత్యాచారం..

నవవధువు.. పెళ్లై మూడు నెలలు కూడా కాలేదు.. ఏం జరిగిందో తెలియదు కానీ.. అనారోగ్యం సమస్యలు తలెత్తాయి.. దీంతో అత్తమామలు ఓ బాబా దగ్గరకు తీసుకెళ్లారు.. అయితే ట్రీట్ మెంట్ చేస్తానని.. తప్పకుండా ఆమెకు నయం అవుతుందని నమ్మించాడు ఫేక్ బాబా.. గదిలో బంధించాడు.. కళ్లకు గంతలె కట్టి ఆమెపై అత్యాచారం చేశాడు. ఫేక్ బాబా నిజ స్వరూపం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఫేక్ బాబాను అరెస్ట్ చేశారు.. వివరాల్లోకి వెళితే.. 

హైదరాబాద్ పాతబస్తీలో పరిధిలోని హుస్సేనీ ఆలంకు చెందిన యువతికి మూడు నెలల క్రితం పెళ్లైంది. అయితే ఆరోగ్యం సరిగా లేదని బండ్లగూడ ప్రాంతంలో ఉంటున్న బజార్ బాబా వద్దకు తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. ఆమెకు పూర్తిగా నయం చేస్తానని మాయమాటలు చెప్పిన బజార్ బాబా.. ఆమెను కళ్లకు గంతలు కట్టి గదిలో బంధించి అత్యాచారం చేశాడని కుటుంబ సభ్యులు భవానీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పరారీలో ఉన్న బజార్ బాబాను పోలీసులు మాటు వేసి మహబూబ్ నగర్ చౌరస్తాలో పట్టుకున్నారు. నకిలీ బాబాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తు్న్నారు.