BMW X7 Facelift launched: ఎం స్పోర్ట్ ప్యాకేజీతో బీఎండబ్ల్యూ కార్

BMW X7 Facelift launched: ఎం స్పోర్ట్ ప్యాకేజీతో బీఎండబ్ల్యూ కార్

లగ్జరీ కార్ల కంపెనీ బీఎండబ్ల్యూ భారతదేశంలో ఫేస్ లిస్ట్ ఎక్స్7 ఎస్ యూవీ లాంఛ్ చేసింది. ఎక్స్ డ్రైవ్ 40ఐ, ఎక్స్ డ్రైవ్ 40డీ వేరియంట్లలో ఈ ఫ్లాగ్‍షిప్ ఎస్‍యూవీ కార్లు అందుబాటులోకి వచ్చాయి. వీటికి సంబంధించి ప్రీ బుకింగ్స్ మంగళవారం (జనవరి 17) నుంచి ప్రారంభమయ్యాయి. కార్ల డెలివరీ మార్చి నెల నుంచి ప్రారంభంకానుంది.  

ఎక్స్ డ్రైవ్ 40ఐ పెట్రోల్ వెర్షన్ ధర రూ. 1.22 కోట్ల నుంచి ప్రారంభంకానుండగా, ఎక్స్ డ్రైవ్ 40డీ డీజిల్ వెర్షన్ రూ.1.25 కోట్ల నుంచి మొదలవుతుంది. రెండు వెర్షన్లు ఎం స్పోర్ట్ ప్యాకేజీతో వస్తాయి. వీటిలో 3.0 లీటర్ సిక్స్ సిలిండర్ ఇంజన్ ఉంటుంది. హైబ్రిడ్ డీజిల్, పెట్రోల్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 8 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో వచ్చే ఈ కార్లు.. 5.0 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి.