హైదరాబాద్, వెలుగు: జెన్‌కో అకౌంట్స్ విభాగంలో గత కొన్నేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఇన్‌చార్జ్ ప్రమోషన్లకు తాజాగా ఆమోదం తెలపడంపై అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ (వీఓఏటీ) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు గురువారం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. అంజయ్య నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఎనర్జీ సెక్రటరీ నవీన్ మిట్టల్, అలాగే జెన్‌కో సీఎండీ హరీశ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసింది. సుదీర్ఘకాలంగా నలుగుతున్న ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపడంపై అసోసియేషన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం అకౌంట్స్ అధికారుల్లో నూతన ఉత్సాహాన్ని నింపిందని జనరల్ సెక్రటరీ అంజయ్య పేర్కొన్నారు. భవిష్యత్తులోనూ ఉద్యోగుల సంక్షేమం, కెరీర్ అభివృద్ధి, పెండింగ్‌లో ఉన్న ఇతర సమస్యల పరిష్కారానికి ఇదే విధమైన సహకారం అందించాలని ఆయన ఎనర్జీ సెక్రటరీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎనర్జీ సెక్రటరీకి పుష్ప గుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. అనంతరం జెన్కోసీఎండీ హరీశ్‌కు కృతజ్ఞతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీఓఏటీ అధ్యక్షుడు నాసర్ షరీఫ్, సీహెచ్. అనూరాధ, సిద్దు, డి. శ్రీనివాస్, ఎం. శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
