బోడుప్పల్ ​కార్పొరేషన్​కాంగ్రెస్ ​కైవసం

బోడుప్పల్ ​కార్పొరేషన్​కాంగ్రెస్ ​కైవసం

మేడిపల్లి, వెలుగు: మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మిరవిగౌడ్​పై కాంగ్రెస్ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో కార్పొరేషన్ కాంగ్రెస్​కైవసం చేసుకున్నట్లయింది. మొత్తం 28 కార్పొరేటర్లు ఉండగా, శనివారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అవిశ్వాస తీర్మానానికి 22 మంది కార్పొరేటర్లు మద్దతు తెలిపారు. కీసర ఆర్డీఓ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరిగింది.