నాలుగు నెలల చిన్నారి కోసం సాయం కోరిన సోనూ సూద్

నాలుగు నెలల చిన్నారి కోసం సాయం కోరిన సోనూ సూద్

గత కొన్ని నెలల నుండి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి గురించి అందరికీ తెలిసిందే. కరోనా బాధితులకు అండగా ఉంటూ తనవంతు సాయం చేస్తున్నారు బాలీవుడ్ న‌టుడు సోను సూద్. ప్రజల గుండెల్లో దేవుడు గా నిలిచిన సోను సూద్  ఎంతోమంది బాధితులకు తమకున్న సమస్యల పరంగా సహాయం అందించారు. ఇలా అందరికి సాయం చేసే సోనుసూద్‌ తాజాగా తనకు సాయం కావాలంటూ ట్విటర్‌లో అడిగారు. ఓ నాలుగు నెలల చిన్నారికి బీ-నెగ‌టివ్ బ్ల‌డ్ అవ‌స‌ర‌మంటూ సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు కోరారు.

ఈ మేర‌కు శుక్రవారం ఆయన ట్వీట్‌ చేస్తూ… ‘ప్రాణాపాయ స్థితిలో ఉన్న నాలుగు నెలల అద్వేత్‌ను కాపాడానికి ప్రయత్నిస్తున్నాం. వెంటనే బి-నెగటివ్‌ బ్లడ్‌ కావాలి. దయచేసి ఈ గ్రూప్‌ వ్యక్తులు ఎవరైన ముందుకు వచ్చి రక్త దానం చేయగలరు’ అని సోనూ సూద్‌‌ పిలుపు నిచ్చారు.