వారణాసిలో పూజలు..సంప్రదాయ దుస్తుల్లో సన్నీ లియోన్

వారణాసిలో పూజలు..సంప్రదాయ దుస్తుల్లో సన్నీ లియోన్

బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్‌ (Sunny leone)కు టాలీవుడ్‌లో కూడా మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఎప్పుడు తనదైన ఫోటో షూట్స్ తో ఇంస్టాగ్రామ్ ను షేక్ చేసే పనిలో ఉంటుంది. కుర్రాళ్లను షాక్ కు గురి చేసేలా చేస్తోంది. ఇక లేటెస్ట్ గా సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరిని మరోసారి ఆశ్చర్యపోయేలా చేసింది. గురువారం వారణాసిలో జరిగిన గంగా హారతికి సన్నీలియోన్ హాజరయ్యారు. 

సన్నీ చాలా పద్ధతిగా చీర కట్టుకుని..భక్తిశ్రద్ధలతో పూజలు చేస్తున్న ఫొటోస్ ను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 'గంగా హారతి చూడటం వారణాసిలో అత్యంత అద్భుతమైన అనుభవం' అంటూ ట్వీట్ లో తెలిపింది. పింక్ డ్రెస్‌, మెడలో దండతో కార్యక్రమానికి హాజరైంది. పండితులు పూజలు చేస్తుంటే రెండు చేతులు కలిసి నమస్కరిస్తూ.. కనిపించింది. ఆమెతో పాటుయాక్టర్ అభిషేక్ సింగ్ కూడా ఉన్నారు. ప్రస్తుతం సన్నీ లియోన్‌ పూజకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మొదట పోర్న్‌స్టార్‌గా కెరియర్‌ను స్టార్ట్ చేసిన సన్నీలియోన్..నటిగా బాలీవుడ్‌లో జిస్మ్ 2మూవీతో అడుగుపెట్టి తనకంటూ ఓ ప్రత్యేకత సంపాదించుకుంది. నటిగా, హాట్ స్టార్ గా ఎంతో మంది ఫ్యాన్స్ ను తన చుట్టూ ముడేసుకున్న సన్నీ లియోన్.. ప్రస్తుతం సౌత్ సినిమాల్లో కూడా ఫుల్ బిజీ అయిపోయింది..అంతేకాకుండా.. సన్నీ లియోన్‌ హిందీ భాషల్లోనూ, తెలుగు, తమిళ,మలయాళ ,కన్నడ భాషల్లో మూవీస్..ఐటెం సాంగ్స్ చేస్తూ  చేస్తూ బిజీగా ఉంది. తెలుగు మంచు మనోజ్ కరెంట్ తీగ, రాజశేఖర్ PSV గరుడవేగా,మంచు విష్ణు జిన్నా మూవీల్లో నటించింది. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sunny Leone (@sunnyleone)