యోగాతో ఫిట్ నెస్ కాపాడుకుంటున్న సెలబ్రెటీలు

యోగాతో ఫిట్ నెస్ కాపాడుకుంటున్న సెలబ్రెటీలు

యోగా అనేది మనసుకు, శరీరానికీ ఓదార్పునిస్తుంది. చాలా మంది క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ.. ఇతరులకూ అవగాహన కల్పిస్తున్నారు. ఈ విషయంలో బాలీవుడ్ నటులు కూడా తక్కువేం కాదు. తమ దైనందిన జీవితంలో ఫిట్‌గా. ఆరోగ్యంగా ఉండటానికి యోగా చాలా సహకరిస్తుందని అంటున్నారు ఈ ఫేమస్ స్టార్ హీరోయిన్స్. 

 రోజూ 101 'సూర్య నమస్కారాలు' : కరీనా కపూర్

ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఫిట్‌నెస్ ఔత్సాహికురాలు. అంతేకాకుండా ప్రతీరోజూ వ్యాయామం చేస్తూ యాక్టివ్ గా ఉంటోంది. ఒకప్పుడు ప్రతిరోజూ 101 'సూర్య నమస్కారాలు' చేసిన ఖ్యాతిని పొందిన నటిగా కూడా పేరు తెచ్చుకుంది. దీనికి తోడు యోగా, దాని ప్రయోజనాల గురించి బోధిస్తూ... వివిధ యోగాసనాలు చేస్తూ.. వాటికి సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ దూసుకుపోతున్నారు కరీనా కపూర్. 

క్రెడిట్ గోస్ టూ యోగా : మలైకా అరోరా
అభిమానులు యోగా చేయడానికి ఆసక్తి చూపేందుకు సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు బ్యూటీఫుల్ మలైకా అరోరా. తరచూ యోగాకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ... తన టోన్డ్ ఫిజిక్, ఫిట్ నెస్ విధానాలతో మలైకా ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటోంది. ఇలా ఉండడానికి యోగానే కారణమని, ఫుల్ క్రెడిట్స్ యోగాకే ఇస్తాననని అంటోంది మలైక. అంతే కాదు యోగాపై ప్యాషన్ తో ముంబైలో ఓ యోగా స్టూడియోను కూడా ప్రారంభించి, దాని వల్ల కలిగే ప్రయోజనాలనూ మలైకా బోధిస్తోంది.

 ఫిట్ నెస్ డైరీస్ @రకుల్ ప్రీత్ 

ఇక స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ కూడా వీళ్లకు తక్కువేం కాదు. కరీనా, మలైకా మాదిరిగానే తన ఫిట్ నెస్ కు సంబంధించిన విషయాలను ఫిట్‌నెస్ డైరీస్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటిఫుల్ లేడీ. ఈ ఫొటోలను, వీడియోలను చూస్తేనే తెలుస్తుంది రకుల్ కి యోగా చేయడం అన్నా, ఫిట్ నెస్ అన్నా ఎంత ఇంట్రెస్టో. అంతే కాదు కరీనా కపూర్, అనన్యా పాండే లాంటిసెలబ్రిటీలకు శిక్షణిస్తోన్న యోగా ట్రైనర్ అన్షుక పర్వాణి వద్దకు రకుల్ కూడా చేరిపోయి యోగాసనాలను ప్రాక్టీస్ చేస్తోందట.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

ఫిట్ గా ఉండాలంటే యోగా తప్పనిసరి : సారా అలీఖాన్ 

ఫిట్‌గా ఉండేందుకు యోగా అత్యంత తెలివిగల మార్గమని సారా అలీఖాన్ భావిస్తోంది. ఇతర బాలీవుడ్ ప్రముఖుల మాదిరిగానే, సారా కూడా యోగా సాధన చేయడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఇండస్ట్రీలో ఫిట్ బాడీ ఉన్న సారా... ఒకప్పుడు 96 కిలోల బరువుండేదట. ప్రస్తుతం ఆమె చాలా ప్రదేశాలలో యోగా యొక్క ప్రయోజనాల గురించి చెప్పడమే కాకుండా...యోగాను సైతం తన లైఫ్ లో పార్ట్ చేసుకొని క్రమం తప్పకుండా సాధన చేస్తోంది.

యోగా ప్రియురాలు శిల్పా శెట్టి

తన  సౌందర్యవంతమైన, మృదువైన, మెరుస్తున్న చర్మానికి యోగానే కారణమని భావిస్తోంది యోగా ప్రియురాలు శిల్పా శెట్టి. తన దినచర్యలో యోగాను కూడా భాగం చేసుకున్న ఆమె... ఆ ఆసనాలకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పంచుకుంటోంది ఈ భామ. ఇవే కాదు.. యోగా, ఫిట్‌నెస్ లకు సంబంధించిన పలు ప్రోగ్రామ్‌లనూ చేసిన శిల్పా.. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందేందుకు ఓ హెల్త్ అప్లికేషన్‌ను కూడా డెవలప్ చేసి, పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది.

ప్రశాంతతంగా ఉండాలంటే యోగా చేయాలి : దియా మీర్జా

సుస్థిర జీవనం కోసం న్యాయవాదిగా ఉండటమే కాకుండా, సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా యోగాను అభ్యసిస్తోంది దియా మీర్జా. యోగా, ధ్యానం చేయడం ద్వారా శరీరాన్ని మనస్సుతో సమలేఖనం చేయడం, ఈ బిజీ జీవితంలో ప్రశాంతతంగా ఉండాలంటే యోగా చేయడం చాలా మంచిదని నమ్ముతోంది దియా.

బెస్ట్ టిప్ యోగా... : మీరా కపూర్

ఆరోగ్యంగా జీవించడానికి, రోజూ వారి జీవితంలో ఆయుర్వేదాన్ని  భాగంగా చేసుకునేందుకు బెస్ట్ టిప్ యోగానే అని నమ్మే వాళ్లలో ఒకరు మీరా కపూర్. తన ఫిట్ నెస్ ను కాపాడుకునేందుకు రోజూ యోగా చేస్తూ.. తన లైఫ్ లో ముందుకెళ్తోంది మీరా. వీటికి తోడు ఆమె గతంలో వర్చువల్ యోగా వర్క్ షాప్ లనూ నిర్వహించి.. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేందుకు చిట్కాలు, ఉపాయాలనూ ఇస్తోంది.

యోగాతో మానసిక ఒత్తిడి హుష్ కాకీ...

బాలీవుడ్ సెలబ్రిటీలు యోగా చేయడానికి ఇష్టపడతారనడానికి ఈ పోస్టులే రుజువు. యోగా మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆరోగ్యకరమైన జీవితాన్ని ప్రసాదిస్తుంది. ప్రపంచంలో రోజుకు ఎన్ని సంఘటనలు జరుగుతున్నా.. మనం మాత్రం సానుకూలంగా, ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. వాటన్నింటికీ యోగానే సమాధానం చెప్పగలదని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.