అమెరికాలో తొలగని మంచు కష్టాలు

అమెరికాలో తొలగని మంచు కష్టాలు

అమెరికాలో మంచు కష్టాలు ఇంకా తొలగిపోవడం లేదు. స్నో బాంబ్ ఎఫెక్ట్ నుంచి ఇంకా జనం కోలుకోవడం లేదు. మంచు ఎఫెక్ట్ ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అయితే రోడ్లపై పేరుకుపోయిన మంచును తొలగించే పనిలో సిబ్బంది ఉన్నారు. ఇప్పటికే బఫెలో సిటీలో డ్రైవింగ్ బ్యాన్ చేశారు. కార్లు డ్రైవింగ్ చేస్తూ వెళ్తే రోడ్లపై మంచుతో గ్రిప్ దొరకడం లేదు. దీంతో యాక్సిడెంట్లు అవుతున్నాయి. దీంతో మరికొన్ని రోజులు డ్రైవింగ్ బ్యాన్ కొనసాగనుంది. మరోవైపు ఫ్లైట్స్ క్యాన్సిలేషన్స్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకొనేందుకు ముందస్తుగా వేసుకున్న టూర్ ప్లాన్స్ స్నో బాంబ్ ఎఫెక్ట్ తో రద్దయ్యాయి. 

స్నో ఎఫెక్ట్ తో బఫెలో సిటీలో జనం చాలా ఇబ్బందులకు గురయ్యారు. 40 ఏళ్ల తర్వాత ఈ స్థాయి స్నో స్ట్రోమ్ వచ్చింది. అయితే ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోయారు. పలు స్టోర్లలో సరుకులు లూఠీ చేశారు. మంచు తుఫాన్ తో స్టోర్లకు సిబ్బంది ఎవరూ రాలేదు. దీంతో సరుకులు ఎత్తుకెళ్లారు. డ్రింక్స్, బట్టలు, ఫుడ్ మెటీరియల్ ఇలా చాలా వరకు ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. స్టోర్లు ఖాళీ అవడంతో సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన బఫెలో సిటీ పోలీసులు మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకున్నారు.