ఈ ఏడాది ఘనంగా బోనాల పండుగను నిర్వహిస్తాం : మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఈ ఏడాది ఘనంగా బోనాల పండుగను నిర్వహిస్తాం  :  మంత్రి పొన్నం ప్రభాకర్‌

ఈ ఏడాది ఘనంగా నెల రోజులపాటు బోనాల పండుగను నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.   ఆషాఢ మాసం బోనాలపై హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పండగ సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ డిపార్ట్మెంట్ చేయాల్సిన ఏర్పాటు ,హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న గుడిలకి విద్యుత్ అలంకరణ ,భక్తులకు తాగు ఏర్పాట్లు ,విద్యుత్ ఇబ్బందులు లేకుండా చూడడం ,దేవాలయాల వద్ద భద్రత ,పార్కింగ్ ప్రదేశాలు తదితర అంశాలపై మంత్రి అధికారులతో చర్చించారు. 

హైదరాబాద్‌ పరిధిలో 2 వేల 400కు పైగా దేవాలయాలున్నాయని..  బోనాల సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచుతామని ఈ సందర్భంగా తెలిపారు.  28 ప్రముఖ ఆలయాలకు ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారని మంత్రి వెల్లడించారు. 

మరోవైపు ఆషాడ మాసం బోనాలకు రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వనించారు కమిటీ సభ్యులు.  గొల్కొండ, సికింద్రాబాద్, లాల్ దర్వాజ దేవాలయాల కమిటీ సభ్యులు సీఎం కలిసి సన్మానించారు.  సీఎం రేవంత్ కు ఆశీర్వచనం అందించి ఆహ్వాన పత్రికను అందించారు ఆలయ అర్చకులు. తెలంగాణలో ఎంతో ఘనంగా జరిగే బోనాల ఉత్సవాలను ఈ సారీ ఘనంగా నిర్వహించాలని సీఎం ను కోరారు కమిటీ సభ్యులు.